logo

కుళాయి నీరు తాగి.. వసతిగృహ విద్యార్థులకు అస్వస్థత

పురపాలక సంఘం పైపులైను ద్వారా వచ్చే కుళాయి నీరుతాగి 20 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 24 Jun 2024 01:59 IST

అంబులెన్స్‌లో నెల్లూరుకు విద్యార్థుల తరలింపు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పైపులైను ద్వారా వచ్చే కుళాయి నీరుతాగి 20 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, విద్యార్థుల కథనం మేరకు.. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోని ఆర్‌వో ప్లాంట్‌ మరమ్మతులకు గురైంది. ఈక్రమంలో విద్యార్థులు వసతి గృహంలోని కుళాయి నీటిని తాగారు. దీంతో విద్యార్థులు విరేచనాలు కావడంతో అస్వస్థకు గురయ్యారు. ప్రిన్సిపల్‌ మధుసూదన్‌బాబు, వసతిగృహ వార్డెన్‌ హుటాహుటిన వారిని పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆర్డీవో కిరణ్‌కుమార్, కమిషనర్‌ వెంకటేశ్వర్లు విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. ఇరువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి మెరుగుపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మరో ఆరుగురు విద్యార్థులను నెల్లూరు తరలించామని, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగుందని ప్రిన్సిపల్‌ మధుసూదన్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని