logo

మళ్లీ ధర తగ్గిన తోతాపురి

తోతాపురి మామిడికాయల ధరలు మళ్లీ పతనమయ్యాయి. టన్ను రూ.28 వేల నుంచి రూ.24 వేలకు తగ్గిపోయింది.

Published : 24 Jun 2024 02:13 IST

టన్ను రూ.24 వేలు
మామిడి రైతుల గగ్గోలు

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి వచ్చిన తోతాపురి మామిడి కాయలు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: తోతాపురి మామిడికాయల ధరలు మళ్లీ పతనమయ్యాయి. టన్ను రూ.28 వేల నుంచి రూ.24 వేలకు తగ్గిపోయింది. ఉన్నపళంగా టన్నుకు రూ.4 వేలు పతనం కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్‌ అయి తమను నిలువునా ముంచుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధర విషయంలో వారు దోబూచులాడుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని అన్నదాతలు వాపోతున్నారు.

తోతాపురి గత వారం రోజులుగా టన్ను రూ.22 వేల నుంచి రూ.28 వేలకు పెరిగింది. శనివారం మార్కెట్‌లో ర్యాంపు వ్యాపారులు తోతాపురి గుజ్జు కాయలను టన్ను రూ.28వేలకు కొనుగోలు చేయగా పండ్ల గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు రూ.30 వేలకు కొన్నారు. గిట్టుబాటు ధర లేక వారం రోజులుగా కోతలను నిలిపివేసిన రైతులు ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆదివారం కాయలు కోసి మార్కెట్‌కు తరలించారు. ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌కు దిగుబడులు రావడంతో సిండికేట్‌ అయి ఉన్నపళంగా ధర తగ్గించేశారని, టన్ను రూ.28 వేల నుంచి రూ.24 వేలకు పడిపోవడంతో రైతులు వాపోయారు.  .

కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టిపెడితేనే..

వారం కిందట తోతాపురి టన్నుకు రూ.30 వేలు ఇవ్వాలని ఆదేశించినా అమలుకు నోàÛకనే కలెక్టరు షన్మోహన్‌ బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టరు సుమిత్‌కుమార్‌ టన్ను రూ.30వేలు ఇప్పించేలా చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని, జిల్లాలోని ప్రజాప్రతినిధులు సైతం ఈ దిశగా ఆలోచించాలని మామిడి రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని