logo

సీటిచ్చారు.. వసతికి చోటివ్వకున్నారు

తిరుపతిలోని తితిదే విద్యాసంస్థల్లో సీటు సాధించడం అదృష్టమని భావిస్తున్న దూరప్రాంత విద్యార్థినులను వసతి గృహాల్లో ప్రవేశం కల్పించ కుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారిని ఇబ్బందికి గురి చేస్తోంది.

Updated : 11 Jul 2024 05:12 IST

తితిదే విద్యాసంస్థల హాస్టళ్లలో ప్రవేశాలు దొరక్క అవస్థలు
మహిళా వర్సిటీ (తిరుపతి), న్యూస్‌టుడే

తిరుపతిలోని తితిదే విద్యాసంస్థల్లో సీటు సాధించడం అదృష్టమని భావిస్తున్న దూరప్రాంత విద్యార్థినులను వసతి గృహాల్లో ప్రవేశం కల్పించ కుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారిని ఇబ్బందికి గురి చేస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు ఆడపిల్లలకు ఇక్కడ పూర్తి భద్రత ఉంటుందని  తల్లి దండ్రులు భరోసాగా భావిస్తుండగా.. వసతి గృహంలో సీటు పొందేం దుకు పడే ఆగచాట్లు అన్నీ ఇన్నీ కావనే ఆరో పణలున్నాయి.  పద్మావతి జూని యర్‌ కళాశాలలో 1950 మంది చదువుతున్నారు. దీనికి సంబంధించిన ధరణి, శాంభవి, ప్రణతి వసతిగృహాల్లో 500 మంది ప్రథమ సంవ త్సరం, మరో 500 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. ప్రస్తు తం ప్రథమ సంవత్స రంలో కళాశాలలో సీటు పొంది వసతి గృహాల్లో సీటు దొర కని వారిలో అదనం గా 250 మందికివసతి గృహాల్లో వసతి కల్పిం చేందుకు వీలుంది. అధికారులు దీనిపై ఎలాం టి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

వెనుదిరుగుతున్న విద్యార్థినులు

తితిదే కళాశాలల్లో చదివే విద్యార్థినుల్లో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అత్యధికులు ఉన్నారు. అనంతపురం, మదనపల్లె, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన అనేక మంది విద్యార్థినులకు కళాశాల సీటిచ్చి వసతి కల్పించడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వసతిగృహాల్లో ఉండలేక వెనుదిరుగుతున్నారు. దీనికితోడు ప్రైవేటు వసతిగృహాలు కళాశాలకు దూరంగా ఉండటంతో రోజూ కళాశాలకు రాకపోకలు సాగించేటప్పుడు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయనే భయంతో తల్లిదండ్రులు కూడా కళాశాల వసతిగృహాల్లో సీటు కల్పించాలని కోరుతున్నారు.

అయోమయంలో తల్లిదండ్రులు

పేదరికంలో కొట్టుమిట్టాడుతూ పదో తరగతి వరకు చదివించిన తమ పిల్లలను తితిదే కళాశాలలో చేర్పిస్తే ఉచిత విద్యతోపాటు భోజన, వసతి సదుపాయాలు ఉంటాయని అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూశారు. వసతిగృహాల్లో ప్రవేశం కల్పించకపోవడంతో తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వసతిగృహంలో సీటు కోసం సోమవారం నుంచి కళాశాలకు విద్యార్థినులు, తల్లిదండ్రులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నా సీటు విషయంలో ఎలాంటి స్పందన లభించకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని