logo

Tirumala: చంద్రబాబు ప్రమాణ స్వీకారం వీక్షించిన ప్రజలు

కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార పత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని పెద్ద తిరుపతి ప్రజలు వీక్షించారు.

Updated : 12 Jun 2024 19:58 IST

తిరుమల: కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార పత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని పెద్ద తిరుపతి ప్రజలు వీక్షించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు ఆడిటోరియంకు చేరుకున్నారు. ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన పెద్ద ఎల్.ఈ.డి.స్క్రీన్ మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు