logo

వేడుకగా శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం

తిరుమల  శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి  ప్రత్యేక సహస్రకలశాభిషేకం వేడుకగా జరిగింది.

Updated : 16 Jun 2024 14:59 IST

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి  ప్రత్యేక సహస్రకలశాభిషేకం వేడుకగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా  ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనుల ఉత్సవమూర్తులను తీసుకుని వచ్చారు. అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు  ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో  వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని