logo

TTD: 16న శ్రీ భోగశ్రీనివాసుడికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

జూన్ 16వ తేదీన  తిరుమల  శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది.

Published : 15 Jun 2024 13:10 IST

తిరుమల: జూన్ 16వ తేదీన  తిరుమల  శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరగనుంది. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో తితిదే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య  శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చక స్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని