logo

Harish Mathur: లోక్‌సభలో తెదేపా విప్‌గా బాలయోగి కుమారుడు

అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్‌.. పరిచయం అక్కర్లేని పేరు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడైన హరీష్‌.. పార్లమెంటరీ నియోజకవర్గంలో అణువణువూ తిరిగి సార్వత్రిక

Updated : 23 Jun 2024 09:52 IST

అమలాపురం ఎంపీ హరీష్‌ను ఎంపిక చేసిన చంద్రబాబు

ముమ్మిడివరం: అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్‌.. పరిచయం అక్కర్లేని పేరు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడైన హరీష్‌.. పార్లమెంటరీ నియోజకవర్గంలో అణువణువూ తిరిగి సార్వత్రిక ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019లో ఓటమి పలకరించినా తిరిగి అదేచోట ఈ దఫా సత్తాచాటారు. ఈ యువకుడిని లోక్‌సభలో తెదేపా విప్‌గా పార్టీ అధినేత చంద్రబాబు శనివారం నియమించారు. గతంలో బాలయోగి స్పీకర్‌గా సభను హుందాగా నిర్వహించి.. దేశంలో అన్ని పార్టీల నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు హరీష్‌కు విప్‌గా బాధ్యతలు అప్పగించడం ద్వారా తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హరీష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కోనసీమ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఉద్ఘాటించారు.

రైల్వేలైన్‌ పనులు వేగవంతం చేసేలా..

కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషి చేసి.. తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని హరీష్‌ తెలిపారు. ఇక్కడి రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్‌ క్వాయర్‌ బోర్డు ద్వారా పథకాలు అందేలా చేస్తానన్నారు. కోనసీమలోని ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించడంతో అక్కడి సమస్యలపై అవగాహన ఉందని.. వాటి పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని