logo

రాజమహేంద్రికి ‘భారత్‌ గౌరవ్‌’ రైలు

భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో అయోధ్య-కాశీ యాత్ర పేరిట ఈ నెల 8న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు పది రోజుల యాత్రను ముగించుకుని తిరిగొచ్చింది.

Published : 18 Jun 2024 04:30 IST

భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు  

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో అయోధ్య-కాశీ యాత్ర పేరిట ఈ నెల 8న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు పది రోజుల యాత్రను ముగించుకుని తిరిగొచ్చింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10.38 గంటలకు రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషనుకు చేరుకుని ఇక్కడి ఒకటో ప్లాట్‌ఫామ్‌పై పది నిమిషాల పాటు ఆగింది. ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. విజయవంతంగా యాత్ర ముగించుకుని వచ్చిన భారత్‌గౌరవ్‌ రైలు రాత్రి 12.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. మొత్తం 716 మంది యాత్రికులతో పూరీ జగన్నాథ్, కోణార్క్, గయ విష్ణుపాద, వారణాసి కాశీవిశ్వనాథ, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు, గంగాహారతి, అయోధ్య రామజన్మభూమి, హనుమాన్‌ గర్హి, సరయు నది హారతి, ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం సందర్శన పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని