logo

రామోజీ సేవలు చిరస్మరణీయం

కేబుల్‌ రంగంలో రామోజీరావు సేవలు మరవలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు అన్నారు.

Published : 18 Jun 2024 04:32 IST

చిత్రపటానికి మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నాయకుల నివాళి

పెంటపాడు, న్యూస్‌టుడే: కేబుల్‌ రంగంలో రామోజీరావు సేవలు మరవలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో ఆ సంఘం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మండల ఇన్‌ఛార్జుల సమావేశం, రామోజీరావు సంతాప సభ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకట్రావు మాట్లాడుతూ ఈటీవీ ఛానల్‌ ద్వారా నిరంతర కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు కేబుల్‌ రంగాన్ని మరింత చేరువ చేసిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. ఆయన చేసిన కృషి వల్లే నేడు కేబుల్‌ రంగం ఈ స్థాయిలో ఉందని కొనియాడారు. సీఎం నారా చంద్రబాబునాయుడును కేబుల్‌ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. కేఆర్‌ కృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, భాస్కరరావు, సీతారామయ్య, గోవింద్, రామకృష్ణ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని