logo

వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరిస్తాం: పురందేశ్వరి

ఉత్తరాది నల్లరేగడి నేలల్లో సాగుచేసే వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని, దిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హామీ ఇచ్చారు.

Published : 18 Jun 2024 04:50 IST

పొగాకు సమస్యలపై ఎంపీ పురందేశ్వరికి వినతిపత్రం అందజేస్తున్న  రైతులు 

సీతానగరం, న్యూస్‌టుడే: ఉత్తరాది నల్లరేగడి నేలల్లో సాగుచేసే వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని, దిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హామీ ఇచ్చారు. కొంతకాలంగా పొగాకు సాగులో రైతులు పడుతున్న ఇబ్బందులపై సీతానగరం రైతు కమిటీ నాయకులు గద్దే వెంకటకృష్ట, ఓబులునేని కృష్ణచైతన్య ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఎంపీ పురందేశ్వరిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2021లో తొర్రేడులోనే ఉండే పొగాకు బోర్డును దేవరపల్లికి తరలించారని ఎన్నో అవస్థలు పడుతూ పొగాకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వివరించారు. మిగ్‌జాం తుపాను నష్టపరిహారం గత ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రకటించడమే తప్ప నయాపైసా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది నల్లరేగడి నేలల్లో తొర్రేడుÅలో గతంలో 10 లక్షల కిలోల పొగాకును పండించే పరిస్థితుల నుంచి ప్రస్తుతం 3 లక్షల కిలోలు మాత్రమే పండిస్తున్నామన్నారు. పొగాకు సాగును వదిలేసి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దామంటే చౌడుభూములు కావడంతో ఇతరత్రా పంటలు పండే పరిస్థితులు లేవని వివరించారు. ఈ ప్రాంతం రైతులతోనే దిల్లీలోనే పొగాకు పంట సమస్యలపై సమావేశం పెడతానని ఎంపీ హామీ ఇచ్చారు.  నిడదవోలు సత్యనారాయణ, కాండ్రు శేఖర్, గద్దే నాని, కాండ్రు కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని