logo

వరదలొస్తేనే ఎత్తిపోతలు!

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎగువ ప్రాంతంలో జరిగే పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల ఎత్తిపోతల పథకాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలవనరులశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు.

Published : 18 Jun 2024 04:51 IST

పురుషోత్తపట్నం-పోలవరం వద్ద చెరువును తలపిస్తున్న గోదావరి నదీగర్భం

న్యూస్‌టుడే, సీతానగరం: గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎగువ ప్రాంతంలో జరిగే పోలవరం ప్రాజెక్టు పనుల వల్ల ఎత్తిపోతల పథకాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జలవనరులశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసరికి సమృద్ధిగా నీటి నిల్వలు ఉండడం వల్ల సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పనులే కాకుండా ఉమ్మడి జిల్లాలో దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణ గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో మెట్టలో సాగునీరు సరఫరా సవ్యంగా లేక వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగుకు దూరమవుతోంది. పుష్కర, పురుషోత్తపట్నం, తొర్రిగడ్డ, చాగల్నాడు, వెంకటనగరం, కాటవరం తదితర ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీరు సరఫరా చేయాలంటే 13.2 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు నీటిమట్టం ఉండాలి. పంపుహౌస్‌ వెల్‌ వద్దకు నీటి ప్రవాహం చేరేలా పూడికతీత పనులు చేసి ఒకటి, లేదా రెండు పంపుల ద్వారా తుని వరకు మెట్టకు సాగునీటిని జూన్‌ నెలాఖరు నాటికి పంపించేలా జలవనరులశాఖ చర్యలు ఉండేవి. ఈ పథకాల నిర్వహణకు సంబంధించి గత వైకాపా ప్రభుత్వం సుమారుగా రూ.18 కోట్లకు పైబడి బిల్లులు చెల్లించకపోవడం, గుత్తేదారులు చేతులెత్తేయడంతో పూడికతీత ఇతరత్రా మరమ్మతులు జరగలేదు. గోదావరి నదికి వరదలొచ్చి నీటి ప్రవాహం పెరిగితేనే పథకాలు తిప్పే పరిస్థితి ఉందంటున్నారు. ప్రస్తుతం గోదావరిలో 8 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉందని 20 వేల క్యూసెక్కులకు నీరు చేరితే ఎత్తిపోతల పథకాలన్నీ తిరిగే పరిస్థితి ఉందని జలవనరులశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు