logo

వెంకన్న పరిణయం.. భక్తజన పరవశం

దివ్య మనోహరమూర్తిని చూసి నింగీనేలా మురిసింది. భక్తజనం గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని తలపించింది.

Published : 18 Jun 2024 04:54 IST

కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

మామిడికుదురు: దివ్య మనోహరమూర్తిని చూసి నింగీనేలా మురిసింది. భక్తజనం గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని తలపించింది. అప్పనపల్లిలో స్వామివారి కల్యాణ వేడుక సోమవారం రమణీయంగా సాగింది. బాలబాలాజీస్వామి ఉభయ దేవేరులను పరిణయమాడిన కమనీయ ఘట్టాన్ని భక్తులు కనులనిండుగా వీక్షించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని అర్చకస్వాములు చక్కగా వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని