logo

300 కేజీలకొమ్ము కోణెం

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు మంగళవారం భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోణెం, నెమలికోనెం తదితర రకాలు ఉన్నాయి.

Published : 19 Jun 2024 05:39 IST

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు మంగళవారం భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోణెం, నెమలికోనెం తదితర రకాలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోణెం చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు శ్రమించాల్సి వచ్చింది. క్రేన్‌ సాయంతో కుంభాభిషేకం రేవుకు తరలించారు. మత్స్యకారులు వేలం పాట నిర్వహించగా రూ.36 వేలు ధర పలికింది. చేపల వేట విరామం అనంతరం భారీ చేపలు చిక్కడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
-న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్‌(కాకినాడ) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని