logo

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు.

Published : 19 Jun 2024 05:41 IST

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌ 

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులు, అధికారులు వీటిలో సదుపాయాల కల్పనకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు తగ్గకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో పి.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని