logo

జనరల్‌లో 23.. వృత్తి విద్యలో 19

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా జనరల్‌ విభాగంలో 23వ స్థానంలో నిలవగా ఒకేషనల్‌లో 19వ స్థానంతో సరిపెట్టుకుంది.

Published : 19 Jun 2024 05:59 IST

ఇంటర్‌ సప్లిమెంటరీలో నిరాశపరిచిన ఫలితాలు 

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా జనరల్‌ విభాగంలో 23వ స్థానంలో నిలవగా ఒకేషనల్‌లో 19వ స్థానంతో సరిపెట్టుకుంది. జనరల్‌లో 3361 మంది పరీక్షకు హాజరవ్వగా 1662 మందితో 49.4 శాతం ఉత్తీర్ణత సాధించగా  ఒకేషనల్‌లో 422కి గాను 216 మందితో 51 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్‌లో 23వ స్థానంలో నిలవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్‌ విద్యను నాశనం చేసిందని, కనీసం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుకొందని వాపోతున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లోనూ ఉపాధ్యాయులు లేకుండా ఆరంభశూరత్వాన్ని ప్రదర్శించిందని ఆరోపిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని