logo

ధాన్యం బకాయిలు రూ.508 కోట్లు

రబీ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేస్తాం.. ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు..

Published : 19 Jun 2024 06:03 IST

ధాన్యం కాటా వేస్తున్న రైతులు (పాత చిత్రం) 

ఈనాడు, రాజమహేంద్రవరం: రబీ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేస్తాం.. ధాన్యం తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవద్దు.. ఇది అధికారులు, పాలకులు తరచూ చెప్పే మాట.  రైతులు నుంచి పంట సేకరించిన వారం రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన వైకాపా సర్కారు.. దాళ్వా ఉత్పత్తులు సేకరించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి బకాయిలు చెల్లించని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.508 కోట్లు మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

సార్వా సాగుకు రైతులు సమాయత్తవుతున్నా ఇప్పటికీ రైతులకు డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం విక్రయించి దాదాపు రెండు నెలలు అవుతున్నా నేటికీ వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం డబ్బులు రాకపోతే పెట్టుబడికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం బకాయిలపై దృష్టిసారించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లా పరిధిలో 23,082 మంది రైతుల నుంచి 2.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగా.. రూ.498.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో ఇప్పటి వరకు రూ.296.31 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం ఇచ్చి దాదాపు రెండు నెలలు అవుతున్నా వేల మంది రైతులకు రూ.202.41 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇవి ఎప్పటికి చెల్లిస్తారనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని