logo

దయచేసి వినండి.. విశ్రాంతి గదులు సిద్ధమండి

ఉమ్మడి జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్‌ రాజమహేంద్రవరం. నిత్యం సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

Published : 19 Jun 2024 06:06 IST

ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఏసీ ఎగ్జిక్యూటివ్‌ రూము  
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్‌ రాజమహేంద్రవరం. నిత్యం సుమారు 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ ఈ స్టేషన్‌కు టికెట్‌ ఆదాయమే సుమారు రూ.15 లక్షలు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రధాన రైల్వేస్టేషన్‌లోని విశ్రాంత గదులను ఆధునికీకరించారు.

ఏం చేశారంటే..

  • ఎగ్జిక్యూటివ్‌ రూముల్లో టీవీ, కింగ్‌సైజ్‌ కాట్, సింగిల్‌ కాట్‌ పడకలు, టీపాయ్, సోఫా, సీటర్‌ సోఫా, అటాచ్డ్‌ వాష్‌రూమ్, వెస్ట్రన్‌ టాయిలెట్‌(ఆధునిక మరుగుదొడ్లు), స్నానం చేసేందుకు వేడినీటి సౌకర్యం కల్పించారు. వీటిలో బసకు 6 గంటలకు రూ.762, 24 గంటలకు రూ.2004 ఛార్జీ వసూలు చేయనున్నారు. 
  • డబుల్‌ బెడ్‌ రూముల్లో కింగ్‌ సైజ్‌ కాట్‌తోపాటు పైనున్న మిగతా సౌకర్యాలన్నీ కల్పించారు. సింగిల్‌ బెడ్‌ క్యాబిన్లలో క్వీన్‌ సైజు మంచం, షేర్డ్‌ వాష్‌రూమ్‌ సౌకర్యాలు కల్పించారు. డబుల్‌ బెడ్‌ రూముల్లో బసకు ఆరు గంటలకు రూ.629, 24 గంటలకు రూ.1656 వసూలు చేస్తారు. సింగిల్‌ బెడ్‌ క్యాబిన్లకు రూ.421 నుంచి రూ.1,108 వసూలు చేస్తారు. 
  • తొమ్మిది ఏసీ డార్మిటరీల్లో ఒక్కొక్కటి చొప్పున మంచం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వీటిల్లో ఆరు గంటలకు రూ.336, 24 గంటలకు రూ.884 రుసుం వసూలు చేస్తారు.

వెబ్‌సైట్‌లో బుకింగ్‌

ఇప్పటికే ఎగ్జిక్యూటివ్, డబుల్, సింగిల్‌ బెడ్‌రూములు అందుబాటులోకి వచ్చాయని, ఐఆర్‌సీటీసీ నిర్ణయించిన ధరల మేరకు 6, 9, 12, 24, 48 గంటల చొప్పున ప్రయాణికులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఖాళీలు ఇతర వివరాలు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్ద కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని