logo

భానుడా బతికించు..

ఒకవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నా.. జూన్‌ నెలలో సగం రోజులు గడిచిపోయినా భానుడు మాత్రం భగభగ మండుతున్నాడు.

Published : 19 Jun 2024 06:10 IST

ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా అమలాపురం గడియారస్తంభం కూడలి 

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఒకవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నా.. జూన్‌ నెలలో సగం రోజులు గడిచిపోయినా భానుడు మాత్రం భగభగ మండుతున్నాడు. వేసవి కాలానికి మించి ఎండలు కాస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ప్రజలు బయటకు రావాలంటేనే హడలి పోతున్నారు. 

ఈ జాగ్రత్తలు తీసుకుందాం: ఈ ఎండల వేడిమికి డీహైడ్రేషన్‌కు గురి కావడంతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏం సూచిస్తున్నారంటే..నీ వీలైనంత వరకు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ఇళ్లలోనే ఉండాలి. నీ అత్యవసరం ఉంటే ముఖానికి వస్త్రం కప్పుకొని, కళ్లద్దాలు ధరించి ప్రయాణం చేయాలి. నీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు లేదా, ఉప్పు కలిపిన మజ్జిగ వెంట తీసుకెళ్లాలి. ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. నీ శరీరంలో నీటి శాతం తక్కువ కాకుండా చూసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు. నీ ఎవరైనా వడ దెబ్బకు గురైతే వారిని వెంటనే నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లి చల్లని వస్త్రంతో ముఖం, ఒళ్లు తుడవాలి. కొద్ది సమయం తరువాత ఓఆర్‌ఎస్‌ పట్టించి, సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని