logo

రాకపోకలు నరకప్రాయం

నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, కార్మికులు రాకపోకలు సాగించే కాకినాడ సర్పవరం ఆటోనగర్‌లో రహదారులు పరిస్థితి ఇది.. కొన్నేళ్లుగా పూర్తిగా పాడై గుంతలుగా మారినా పట్టించుకున్న నాథేడు లేడు.

Published : 20 Jun 2024 03:49 IST

చెరువును తలపిస్తున్న ఆటోనగర్‌ ప్రధాన రహదారి

ఈనాడు, కాకినాడ: నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, కార్మికులు రాకపోకలు సాగించే కాకినాడ సర్పవరం ఆటోనగర్‌లో రహదారులు పరిస్థితి ఇది.. కొన్నేళ్లుగా పూర్తిగా పాడై గుంతలుగా మారినా పట్టించుకున్న నాథేడు లేడు. దీంతో వాహనదారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. చిన్నపాటి వర్షం కురిస్తే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నో పర్యాయాలు ఇక్కడి స్థల యాజమానులు, కార్మికులు కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే, సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో చేసేది లేక కొంతమంది సొంత డబ్బులతో గుంతలు పూడ్చుకున్నా సమస్య పూర్తిగా తీరలేదు.  ఈ సమస్యను ఏపీఐఐసీ జీఎం రమణారెడ్డి దృషికి తీసుకెళ్లగా ఇప్పటి వరకు ఏపీఐఐసీ నుంచి ఎటువంటి నిధులు విడుదల కాలేదని, ఐలా( ఇండస్ట్రీయల్‌ లోకల్‌ అథారిటీ ఫండ్స్‌) నిధులతో త్వరలోనే పనులు చేపడతామని ఆయన తెలిపారు.

5వ రోడ్డులో పరిస్థితి ఇది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని