logo

‘వైకాపా నేతల బలవంతంతోనే రాజీనామాలు’

ఎన్నికల సమయంలో వైకాపా నాయకుల బలవంతంపైనే రాజీనామాలు ఇచ్చామని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. చేయకపోతే తొలగిస్తామనే బెదిరింపులతో ఉద్యోగాలు వదులుకున్నామని పలువురు వాలంటీర్లు వాపోయారు.

Published : 20 Jun 2024 03:56 IST

ఉద్యోగాలు ఇవ్వాలని వాలంటీర్ల వినతి 

సీతానగరం: ఎన్నికల సమయంలో వైకాపా నాయకుల బలవంతంపైనే రాజీనామాలు ఇచ్చామని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. చేయకపోతే తొలగిస్తామనే బెదిరింపులతో ఉద్యోగాలు వదులుకున్నామని పలువురు వాలంటీర్లు వాపోయారు. సీతానగరం మండలం పరిషత్‌ కార్యాలయంలో బుధవారం వీరంతాచేరి ఉద్యోగాలు కల్పిస్తే బాధ్యతగా ప్రభుత్వం అప్పగించే పనులు చేస్తామన్నారు. కరోనా సమయంలోనూ సేవలు అందించామని, చివరికి ఎన్నికల ప్రచారంలో వాడుకునేలా తమతో రాజీనామాలు చేయించారని వాపోయారు. తాము చేసిన తప్పును మన్నించి కొత్త ప్రభుత్వం కొలువులు ఇవ్వాలని కార్యాలయంలోని సూపరింటెండెంట్‌ గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని