logo

అక్షర సూరీడుకి అశ్రుతాంజలి

సమాజ శ్రేయస్సే ధ్యేయంగా.. అక్షరమే ఆయుధంగా ప్రజాగళం వినిపించిన దార్శనికుడు.. ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు సిబ్బంది ఘన నివాళి అర్పించారు.

Published : 21 Jun 2024 06:29 IST

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఘన నివాళి

ఈనాడు, రాజమహేంద్రవరం: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా.. అక్షరమే ఆయుధంగా ప్రజాగళం వినిపించిన దార్శనికుడు.. ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు సిబ్బంది ఘన నివాళి అర్పించారు. రాజమహేంద్రవరంలోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో గురువారం యూనిట్‌ సారథి టీవీసీఎస్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, సామర్లకోట, అమలాపురం, మండపేటలోని మార్గదర్శి కార్యాలయాల్లోనూ సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించి రామోజీరావుకు నివాళులర్పించారు. 

రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న రాజమహేంద్రవరం ‘ఈనాడు’ యూనిట్‌ సారథి టీవీసీఎస్‌ ప్రసాద్, సిబ్బంది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని