logo

రమణీయం.. శ్రీపుష్పయోగం

దివ్య కల్యాణకాంతుల నడుమ ఉభయ దేవేరులతో స్వర్ణశోభితంగా మెరిసిపోతున్న బాలబాలాజీస్వామివారు విశేష పుష్పాలంకరణతో రమణీయంగా దర్శనమిచ్చారు.

Published : 21 Jun 2024 06:31 IST

పుష్పాలంకరణలో ఉభయ దేవేరులతో బాలబాలాజీస్వామి 

మామిడికుదురు, న్యూస్‌టుడే: దివ్య కల్యాణకాంతుల నడుమ ఉభయ దేవేరులతో స్వర్ణశోభితంగా మెరిసిపోతున్న బాలబాలాజీస్వామివారు విశేష పుష్పాలంకరణతో రమణీయంగా దర్శనమిచ్చారు. అప్పనపల్లి ఆలయంలో స్వామివారి పరిణయోత్సవాల్లో చివరి రోజైన గురువారం రాత్రి 8.30 గంటలకు నిర్వహించిన శ్రీపుష్పయోగం అలరించింది. పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన తూయడపు ఊయలలో స్వామివారు సేద దీరుతున్న కమనీయ దృశ్యాన్ని భక్తులు వీక్షించి పులకించారు. అంతకుముందు ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ద్వాదశ ప్రదక్షిణలు నిర్వహించారు. చినజీయర్‌స్వామి శిష్యుడు చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ ముఖ్య అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, వేద పండితులు పూజోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో కళాకారుల కీర్తనలు, భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆలయ ఏసీ గ్రంధి మాధవి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని