logo

5 హామీలపై చంద్రబాబు సంతకాలు.. తెలుగు యువత సంబరాలు

కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై తెదేపా శ్రేణులు శుక్రవారం సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తూనే...

Updated : 14 Jun 2024 16:06 IST

రౌతులపూడి: కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై తెదేపా శ్రేణులు శుక్రవారం సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తూనే 5 హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడంపై గుమ్మరేగుల గ్రామంలో తెలుగు యువత హర్షం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఫించన్ పెంపు, అన్న కాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలపై సంతకాలు చేయడంతో యువత, రైతులు కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలుగు యువత, ప్రజలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని