logo

Andhra News: పిడుగు పాటు శబ్దానికి తండ్రీకుమారుడి మృతి

పిడుగుపాటు శబ్దానికి తండ్రీకుమారుడు మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో 

Updated : 19 May 2022 10:38 IST

హోళగుంద: పిడుగుపాటు శబ్దానికి తండ్రీకుమారుడు మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి పది గంటల సమయంలో మండల కేంద్రంలోని బీసీ కాలనీలో పిడుగు పడి పెద్దశబ్దం వచ్చింది. ఈ శబ్దానికి సిద్దిక్‌సాహెబ్‌(71), కుమారుడు హుస్సేన్‌ సాహెబ్‌(43) అక్కడికక్కడే మృతిచెందారు. ఒకేసారి తండ్రీకుమారుల మృతిలో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

హాలహర్వి మండలంలో భారీ వర్షం..

మరోవైపు జిల్లాలోని హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో హాలహర్వి- నిట్రవట్టి మధ్య రాకపోకలు నిలిచాయి. మండలంలోని హాలహర్వి- గూళ్యం రహదారి కోతకు గురైంది. మండలంలో 10.5సెం.మీ. వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని