logo

పామును మెడలో వేసుకుని సైకిల్‌ సవారీ!

సాధారణంగా పాము కనిపిస్తే (అది విషకారి కానప్పటికీ) ఆమడదూరం పరుగులు తీస్తుంటారు. అయితే బెళగావి జిల్లాలోని హంగరగా గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధుడు పామును మెడలో వేసుకుని సైకిల్‌ సవారీ చేశారు. ఈ దృశ్యాన్ని ఓ ఔత్సాహిక యువకుడు వీడియో

Updated : 05 Jul 2021 09:49 IST

సర్పధారి

బెళగావి, న్యూస్‌టుడే: సాధారణంగా పాము కనిపిస్తే (అది విషకారి కానప్పటికీ) ఆమడదూరం పరుగులు తీస్తుంటారు. అయితే బెళగావి జిల్లాలోని హంగరగా గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధుడు పామును మెడలో వేసుకుని సైకిల్‌ సవారీ చేశారు. ఈ దృశ్యాన్ని ఓ ఔత్సాహిక యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. మెడలో పాముతో సైకిల్‌పై రివ్వున దూసుకెళ్లిన ఆ వృద్ధుడు గ్రామానికి సమీపంలోని తన పొలం పక్కనున్న అడవిలో ఆ పామును వదిలి పెట్టాడు. సర్పధారి అయిన ఆ వృద్ధుడిని చూసేందుకు హంగరగా గ్రామస్థులు ఉత్సాహం చూపారు. వృద్ధుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ముక్కునవేలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని