logo

AP News: నవ వధువు బలవన్మరణం

అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రత్తిపాడు మండలం పార్వతీపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన మళ్ల వెంకటేశ్వర్లు, అంకమ్మల

Updated : 12 Jul 2021 07:24 IST

మృతి చెందిన గోవర్థిని

పార్వతిపురం(ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రత్తిపాడు మండలం పార్వతీపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన మళ్ల వెంకటేశ్వర్లు, అంకమ్మల కుమార్తె గోవర్థిని. ఇంటర్‌ వరకు చదువుకుంది. మేనమామ బాబు, అత్త వరలక్ష్మి కుమారుడైన ప్రత్తిపాడు మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన కుర్రా శ్రీనివాసరావుతో ఈ ఏడాది మే 13న వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.1.5 లక్షల కట్నం ఇచ్చారు. అత్త వరలక్ష్మి, భర్త శ్రీనివాసరావు రూ.5 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా హింసిస్తుండే వారు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో గోవర్థిని ఇంట్లో దూలానికి చీరతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త ఇంటికి వచ్చి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే యడ్లపాడులో ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ వెల్లడించారు.

మనోవేదనతో మరో మహిళ..

పట్నంబజారు, న్యూస్‌టుడే: భర్త మృతి చెందాడనే మానసిక వేదనతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. లాలాపేట పోలీసుల కథనం ప్రకారం.. గంజిబజారుకు చెందిన గోకవరపు అమరనాథ్‌ మూడు నెలల కిందట కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య వెంకట నాగ భవాని(30) మానసికంగా ఇబ్బంది పడుతోంది. తరచూ ఆమె శ్రీనివాసరావుపేటలోని తన అమ్మ వద్దకు వెళ్లి భర్త చనిపోయాడని, తన ముగ్గురు పిల్లలను ఎలా పోషించాలని బాధపడేది. శనివారం రాత్రి భవాని తన ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఆదివారం ఉదయం నిద్ర లేచిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జత్యానాయక్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని