logo

Mobile: ప్రాణాలు కాపాడిన మొబైల్‌ సిగ్నల్స్‌

ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పోలీసులు గుర్తించి అతని ప్రాణాన్ని కాపాడారు.

Published : 12 Jul 2021 08:07 IST

పెదవాల్తేరు: ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పోలీసులు గుర్తించి అతని ప్రాణాన్ని కాపాడారు. దీనికి సంబంధించి సి.ఐ. కె.ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.చైతన్యవర్మ ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని శనివారం సాయంత్రం 6 గంటలకు అతని స్నేహితుడు అనకాపల్లి పోలీసులకు సమాచారమిచ్చాడు. అతని వద్ద సెల్‌ఫోన్‌ ఉన్నట్లు తెలిపాడు. అనకాపల్లి పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ ఏరియాను ట్రేస్‌ చేయగా.. విశాఖ రామ్‌నగర్‌లో ఉన్నట్లు తెలిసింది. అనకాపల్లి పోలీసులు విశాఖ మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాము ఆధ్వర్యంలో సిబ్బంది సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను గుర్తిస్తూ రామ్‌నగర్‌లోని హోటళ్లను తనిఖీ చేశారు. 8.20 గంటల సమయంలో బాధితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే అతను విషగుళికలు తీసుకొని అపస్మారక స్థితికి చేరుకుని ఉన్నాడు. పోలీసులు వెంటనే 108లో కేజీహెచ్‌కు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. అతని ఆత్మహత్యాయత్నానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని