logo

AP News: కెరటాలకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బలి

స్నేహితులతో సరదాగా గడపడానికి సముద్ర తీరానికి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కెరటాల ఉద్ధృతికి తాళలేక మృతి చెందాడు. ఆ ఘటన పరవాడ మండలం తిక్కవానిపాలెం తీరంలో చోటు చేసుకుంది. పరవాడ ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Updated : 20 Jul 2021 09:53 IST


మృతి చెందిన అరుణ్‌బాబు

పరవాడ, న్యూస్‌టుడే: స్నేహితులతో సరదాగా గడపడానికి సముద్ర తీరానికి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కెరటాల ఉద్ధృతికి తాళలేక మృతి చెందాడు. ఆ ఘటన పరవాడ మండలం తిక్కవానిపాలెం తీరంలో చోటు చేసుకుంది. పరవాడ ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చినగంట్యాడ వుడాకాలనీకి చెందిన పెదిరెడ్డి అరుణ్‌బాబు(27), అతని స్నేహితులు శివగుప్తా, వినోద్‌కుమార్‌, అనిల్‌సాహు సోమవారం ఉదయం 5గంటలకు కారులో తిక్కవానిపాలెం బీచ్‌కు వచ్చారు. కొంత సమయం సరదాగా గడిపారు. 8.30గంటల సమయంలో అరుణ్‌బాబు, శివగుప్తా తీరంలో ఈతకు దిగగా బలమైన కెరటం రావడంతో లోపలికి కొట్టుకుపోయారు. ఈ దృశ్యం చూసి మిగతావారు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు అక్కడికి చేరుకుని శివగుప్తాను రక్షించి ఒడ్డుకి చేర్చారు. అరుణ్‌బాబు మృతి చెందగా, కొంత సమయం తర్వాత మృతదేహం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అరుణ్‌బాబు బీటెక్‌ పూర్తి చేసి బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిగా ఇంటి నుంచే విధులు (వర్క్‌ఫ్రం హోం) నిర్వర్తిస్తున్నారు. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. తల్లి నీరజ, చెల్లి లావణ్య ఉన్నారు. అతనికి వివాహం కాలేదు. ఇంటికి పెద్దదిక్కు అయిన అరుణ్‌బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని