logo

Hyderabad News: అమ్మానాన్న.. మీరెక్కడ..?

ఈ చిత్రంలో అమ్మానాన్నల కోసం ఎదురు చూస్తున్న బాబు వయసు మూడేళ్లు. 2019 జూన్‌ 23న సికింద్రాబాద్‌ పరిధి బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఆరు నెలల చిన్నారిని..

Updated : 11 Dec 2021 07:50 IST

 

ఈ చిత్రంలో అమ్మానాన్నల కోసం ఎదురు చూస్తున్న బాబు వయసు మూడేళ్లు. 2019 జూన్‌ 23న సికింద్రాబాద్‌ పరిధి బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఆరు నెలల చిన్నారిని ఎత్తుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ బస్టాండ్‌లో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. బాబును హైదరాబాద్‌లోని శిశు విహార్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. కేంద్రం సిబ్బంది కార్తీక్‌ అని పేరు పెట్టి ఇన్నాళ్లు ముద్దుగా చూసుకుంటూ సంరక్షించారు. కేసు ఎంతకీ తేలకపోవడంతో మూడు నెలల క్రితం నిజామాబాద్‌లోని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి బదిలీ చేసి, బాబును శిశు గృహ కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. నిర్వాహకులు స్థానిక పోలీసులకు వివరాలు పంపి తల్లిదండ్రులను వెతికే పనిలో ఉన్నారు.

- ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని