logo

TS News: మనవడి ఆట విలువ రూ.11.5 లక్షలు

సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల చొరవతో ఓ బాధితుడు.. తన మనవడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం వల్ల కోల్పోయిన రూ.11.5లక్షలను తిరిగి పొందారు. పోలీసుల ఐదు నెలల కృషి ఫలితంగా డబ్బులు తిరిగి వచ్చాయి. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ లావణ్య ఎన్‌జేపీ కథనం ప్రకారం నగరానికి చెందిన

Published : 16 Dec 2021 08:29 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల చొరవతో ఓ బాధితుడు.. తన మనవడు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం వల్ల కోల్పోయిన రూ.11.5లక్షలను తిరిగి పొందారు. పోలీసుల ఐదు నెలల కృషి ఫలితంగా డబ్బులు తిరిగి వచ్చాయి. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ లావణ్య ఎన్‌జేపీ కథనం ప్రకారం నగరానికి చెందిన సయ్యద్‌ అజ్గర్‌అలీ చరవాణితో ఆయన మనవడు(8) జులై 19న ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో తాత ఖాతాలోని రూ.11.5లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సింగపూర్‌లోని ఓ గేమింగ్‌ సంస్థకు ధారపోసినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆ సంస్థలను సంప్రదించారు. ఐదు నెలలుగా వారితో చర్చలు జరపగా ఎట్టకేలకు సంస్థ డబ్బులు తిరిగి చెల్లించింది. దీంతో తాత మోములో ఆనందానికి హద్దులేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని