logo

Suicide: ఆరో అంతస్తు పైనుంచి పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

హాస్టల్‌ భవనంపై నుంచి కింద పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి టెలికంనగర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ ఒంగోలు

Published : 17 Dec 2021 07:49 IST

​​​​

రాయదుర్గం, న్యూస్‌టుడే: హాస్టల్‌ భవనంపై నుంచి కింద పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి టెలికంనగర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ ఒంగోలు పట్టణానికి చెందిన పిడుగు సురేంద్రరెడ్డి(30) నెల క్రితం నగరానికివచ్చి టెలికాంనగర్‌లోని స్టోన్‌ రూఫ్‌ పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు. నానక్‌రాంగూడలోని క్యాప్‌ జెమినీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తానుంటున్న హాస్టల్‌ భవనం 6వఅంతస్తుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. కొన్నాళ్లు ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆయనకు ఇటీవలే ఆ సంస్థలో ఉద్యోగం లభించింది. అయితే ఇతను మద్యం తాగినట్లు.. ఆ మత్తులో ‘నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని పలువురితో అన్నట్లు సమాచారం. ఆందోళన చెందిన స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. వారువచ్చాక అతను మౌనంగా ఉండటంతో వెనక్కి వెళ్లారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని