logo

AP News: ఆరుష్‌ ఆచూకీ ఎక్కడ...?

తప్పటడుగులు వేస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న కుమారుడు అదృశ్యమై రెండున్నర సంవత్సరాలు దాటినా  ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పిల్లాడిని కనిపెట్టాలని అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సంఘటన జరిగిన తొలినాళ్లలోనే సీఎం

Updated : 24 Dec 2021 08:53 IST

 రెండున్నరేళ్లయినా కనిపెట్టని యంత్రాంగం


తల్లిదండ్రులతో ఆరుష్‌రెడ్డి (పాత చిత్రం)

ముండ్లమూరు, న్యూస్‌టుడే: తప్పటడుగులు వేస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న కుమారుడు అదృశ్యమై రెండున్నర సంవత్సరాలు దాటినా  ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పిల్లాడిని కనిపెట్టాలని అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సంఘటన జరిగిన తొలినాళ్లలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సైతం అందించారు. 
2019లో ఘటన... : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెద ఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని రెడ్డినగర్‌కు చెందిన అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు ఆరుష్‌రెడ్డి అదృశ్యమయ్యే నాటికి బాబు వయసు రెండు సంవత్సరాల ఇరవై నాలుగు రోజులు. 2019 జూన్‌ 24వ తేదీన ఎవరో దుండగులు అపహరించారు. నాటి నుంచి దంపతులిద్దరూ ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులను కలుస్తూ బాబు ఆచూకీ గుర్తించాలని అర్థిస్తూ ఉన్నారు. అధికారులు మారినప్పుడల్లా వారినీ కలిసి వేడుకుంటూనే ఉన్నారు. 
వాలంటీర్‌ పోస్టులకు రాజీనామా... : రెడ్డినగర్‌లో భార్యాభర్తలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. అయితే నవంబర్‌లో అశోక్‌రెడ్డి, డిసెంబర్‌లో జ్యోతి రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నా అధికారులు తమకు న్యాయం చేయలేకపోయారని, వాలంటీర్లుగా ఉండి అధికారులను ప్రశ్నించలేమని ఆవేదనతో రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాబు ఆచూకీ కనిపెట్టాలని అర్థిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని