logo

AP News: విశ్వాసం.. యజమాని ప్రాణాలు నిలిపింది

యజమానిపై తన విశ్వాసాన్ని ప్రదర్శించి తనువు చాలించిదో శునకం. తాచుపామును మట్టుబెట్టి తాను కూడా ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నందిగామ పట్టణానికి చెందిన నర్వనేని మురళీకి జాతీయ రహదారి

Updated : 28 Dec 2021 08:10 IST

పాముతో పోరాడి చనిపోయిన శునకం

నందిగామ, న్యూస్‌టుడే : యజమానిపై తన విశ్వాసాన్ని ప్రదర్శించి తనువు చాలించిదో శునకం. తాచుపామును మట్టుబెట్టి తాను కూడా ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నందిగామ పట్టణానికి చెందిన నర్వనేని మురళీకి జాతీయ రహదారి పక్కనే శివారులో ఫామ్‌హౌస్‌ ఉంది. అందులో ఆయన రాట్‌విల్లర్‌ జాతికి చెందిన ఆడ, మగ కుక్కలను గత ఆరేళ్లుగా పెంచుతున్నారు. మగ కుక్కకు కైజర్‌, ఆడదానికి ఫ్లోరా అని పేర్లు పెట్టి ప్రేమగా చూసేవారు. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఫామ్‌హౌస్‌లో వదిలిపెట్టి ఉదయం ఆరు గంటలకు తిరిగి వాటిని బోనులోకి పంపిస్తారు. ఎప్పటిలాగే ఈ నెల 25న రాత్రి వాటిని బయటకు వదిలి మురళీ ఇంటికి వెళ్లారు. 26న ఉదయం రాగానే కైజర్‌ మాత్రమే కనిపించింది. కొద్దిదూరంలో ఫ్లోరా ఆరుబయట చనిపోయి ఉంది. పక్కనే ఆరడుగుల పొడవైన తాచు పాము చచ్చిపడి ఉంది. యజమానికి ఎక్కడ హాని తలపెడుతుందోనని తలచి పాముతో పోరాడి కాటుకు కుక్క చనిపోయింది.

రెండు రోజుల కిందటే ఫామ్‌హౌస్‌లోని పడక గదిలోకి తాచు పాము వెళ్లిందని మురళీ తెలిపారు. తర్వాత ఎంత వెతికినా కన్పించలేదన్నారు. కుక్కకు కనిపించడంతో చంపిందని చెప్పారు. ఎంతో ప్రేమగా చూసుకున్న శునకం మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దానిని ఖననం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని