logo

AP News: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని..ఇప్పుడు గొప్పమనసుతో..

సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ చిరువ్యాపారి దగ్గర వేరుశనక్కాయలు కొనుక్కొని డబ్బులు ఇవ్వలేదని.. గుర్తుపెట్టుకున్న ఒక బాలుడు అప్పటి నుంచి అతడికోసం ఎంతగానో వెతికాడు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకొని రూ.25 వేలు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. వి

Updated : 31 Dec 2021 10:04 IST

2010లో పెదసత్తియ్యతో బీచ్‌లో ప్రణవ్‌ తీసుకున్న ఫొటో

కాకినాడ కలెక్టరేట్‌: సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ చిరువ్యాపారి దగ్గర వేరుశనక్కాయలు కొనుక్కొని డబ్బులు ఇవ్వలేదని.. గుర్తుపెట్టుకున్న ఒక బాలుడు అప్పటి నుంచి అతడికోసం ఎంతగానో వెతికాడు. చివరకు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకొని రూ.25 వేలు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకెళితే.. కాకినాడకు చెందిన మోహన్‌ నేమాని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2010లో వారు కాకినాడ బీచ్‌ను సందర్శించారు. మోహన్‌ తన కుమారుడు ప్రణవ్‌, కూతురుకి బీచ్‌లో గింజాల పెదసత్తియ్య వద్ద వేరుశనక్కాయలు కొన్నారు. పర్సు మర్చిపోవడంతో అతనికి డబ్బులివ్వలేకపోయారు. అప్పుడు ప్రణవ్‌ అతడితో ఫొటో దిగారు. అప్పటినుంచి వారు కాకినాడ వచ్చిన ప్రతిసారీ అతని కోసం వాకబు చేసినా ఫలితం లేకపోయింది. మోహన్‌ తన స్నేహితుడైన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆ విషయం చెప్పారు. ఎమ్మెల్యే తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రణవ్‌ తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. పెదసత్తియ్యకు సంబంధించిన వారుంటే సంప్రదించాలని, తన పీఏ ఫోన్‌నంబరు ఇచ్చారు. చివరికి అతని కుటుంబం జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటున్నట్లు గుర్తించారు. పెద సత్తియ్య మరణించగా, ఆయన కుటుంబసభ్యులను గురువారం కాకినాడ ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి, ఎన్‌ఆర్‌ఐ మోహన్‌, ఆయన పిల్లలు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.

పెదసత్తియ్య కుటుంబ సభ్యులకు నగదు అందజేస్తున్న ప్రణవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు