logo

AP News: ఈ ఆలయంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం

కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వెలిసిన సంజీవరాయ స్వామికి ఆదివారం పురుషులు భక్తిశ్రద్ధలతో పొంగళ్లు సమర్పించారు. ఈ ఆలయంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంది. అందుకే ఏటా పురుషులే పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఏటా సంక్రాంతికి

Updated : 10 Jan 2022 10:51 IST


ఆలయం వెలుపులి నుంచి స్వామి వారిని దర్శించుకుంటున్న మహిళలు

పుల్లంపేట, న్యూస్‌టుడే : కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వెలిసిన సంజీవరాయ స్వామికి ఆదివారం పురుషులు భక్తిశ్రద్ధలతో పొంగళ్లు సమర్పించారు. ఈ ఆలయంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంది. అందుకే ఏటా పురుషులే పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఏటా సంక్రాంతికి ముందు ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పురుషులు అవసరమైన సామగ్రితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగళ్లు వండారు. అనంతరం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం కావడంతో వారు వెలుపలి నుంచే స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి సమర్పించిన ప్రసాదాలను కూడా మహిళా భక్తులు తినకూడదన్నది ఇక్కడి సంప్రదాయం.


పొంగళ్లు వండుతున్న పురుషులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని