logo

Crime News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతిపై వీడని మిస్టరీ

గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చదలవాడ తనూజ(26).. శిఖామణి సెంటర్‌లో అనూమానాస్పదంగా మృతి చెంది మూడు రోజులు గడచినా ఇప్పటి వరకు ఈ

Updated : 20 Jan 2022 08:51 IST

గుణదల, న్యూస్‌టుడే: గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చదలవాడ తనూజ(26).. శిఖామణి సెంటర్‌లో అనూమానాస్పదంగా మృతి చెంది మూడు రోజులు గడచినా ఇప్పటి వరకు ఈ కేసు మిస్టరీ వీడలేదు. నగరం నడిబోడ్డున ఆమె మృతదేహం లభ్యమైనా పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో తనూజ మృతిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి. సీసీ కెమెరాల వైఫల్యంతో కేసు విచారణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నైస్‌ బార్‌ సమీపంలో ఉన్న కెమెరాల్లో సంఘటన జరిగిన ప్రదేశం కవర్‌ అవుతుంది. మరోవైపు మృతదేహం గుర్తించిన ప్రాంతంలో పలువురు ప్రముఖులు నివసిస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కాకపోవడం గమనార్హం.

ఆదివారం రాత్రి 11.45 గంటల వరకు ఆ ప్రదేశంలో బార్‌ నిర్వాహకులు, చిరు వ్యాపారులు ఉన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదు. అర్ధరాత్రి 12.30 గంటలకు బీట్‌ కానిస్టేబుల్స్‌ తనూజ మృతదేహాన్ని గుర్తించారు. కేవలం 45 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేదే ఈ కేసులో కీలక అంశంగా మారింది. స్థానికులు మాత్రం అక్కడ ఎటువంటి రోడ్డు ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. మరోవైపు మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కానీ, మృతురాలి శరీరంపై ఎలాంటి రక్తపు మరకలు కనిపించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే తనూజ మృతదేహాన్ని ఇక్కడ పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో మాచవరం స్టేషన్‌ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ హత్యను గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.. ఇప్పుడు తనూజ కేసును కొలిక్కి తీసుకురావడం సవాల్‌గా మారింది. బుధవారం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో తనూజ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని