logo

చిన్నారి లేఖాస్త్రం.. కాలిబాట సాకారం: కేటీఆర్‌ ట్వీట్‌తో స్పందించిన అధికారులు

ఇంటి ముందు కాలిబాట కోసం చేపట్టిన పనులను అసంపూర్తిగా వదిలేశారని కార్తికేయ అనే చిన్నారి ప్రస్తావించగా మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన ఈ బాలుడు సమస్యను

Updated : 30 Jan 2022 07:45 IST

కార్తికేయతో మాట్లాడుతున్న బల్దియా అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి ముందు కాలిబాట కోసం చేపట్టిన పనులను అసంపూర్తిగా వదిలేశారని కార్తికేయ అనే చిన్నారి ప్రస్తావించగా మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన ఈ బాలుడు సమస్యను ప్రస్తావిస్తూ రాసిన లేఖను అతని మామయ్య.. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా.. మంత్రి స్పందించారు. సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. వెంటనే జడ్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఉపకమిషనర్‌ మోహన్‌రెడ్డి, ఇంజినీర్లు కలిసి ఆ బాలుడి ఇంటికెళ్లారు. అతనితో మాట్లాడి.. కాలిబాటను త్వరగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని