logo

Telangana News: పోలీసులు కేసు పెడతారనే భయంతో విద్యార్థి ఆత్మహత్య

స్నేహితులతో కలిసి గంజాయి తాగుతున్నట్లు ఠాణాకు పిలిచి పోలీసులు విచారణ చేయడంతో మనస్తాపనికి గురైన యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి 11 గంటలకు

Updated : 04 Feb 2022 09:21 IST

అమరచింత, న్యూస్‌టుడే: స్నేహితులతో కలిసి గంజాయి తాగుతున్నట్లు ఠాణాకు పిలిచి పోలీసులు విచారణ చేయడంతో మనస్తాపనికి గురైన యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి 11 గంటలకు పట్టణంలోని బీసీకాలనీలో సంచలనం సృష్టించింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కమలాకర్‌గౌడ్‌, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకొడుకు శబరినాథ్‌గౌడ్‌ (20) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్నాడు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కొందరు గంజాయి తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో విచారణ చేపట్టి వారు ఇచ్చిన సమాచారంతో శబరినాథ్‌తో పాటు అరవింద్‌ అనే విద్యార్థిని అమరచింత పోలీసులు ఠాణాకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో తల్లిదండ్రుల సొంత పూచీకత్తుతో ఇంటికి పంపారు. అనంతరం తల్లిదండ్రులు బంధువుల ఇంట జరిగిన పెళ్లికి వెళ్లగా పోలీసులు తనను విచారణ చేయడంతో కేసు పెడతారనే భయంతో ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎస్సై మహేశ్‌గౌడ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఠాణాకు పిలిచి సీఐ సమక్షంలో విచారణ చేసి పంపించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని