logo

విడదీయలేని తల్లి పాశం.. దూడ కోసం 2 కి.మీ పరిగెత్తిన ఆవు

శివగంగై జిల్లాలోని కండరమాణిక్యం గ్రామానికి చెందిన రైతు పెంచుకుంటున్న ఆవు మేతకు వెళ్లి పొన్నకుడి ప్రాంతంలో దూడను ఈనింది. విషయం తెలుసుకున్న ఆ రైతు ఆవుని, దూడను తీసుకొచ్చేరదుకు వెళ్లాడు. దూడను కారు వెనుకభాగంలో ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుండగా తల్లి ఆవు తన బిడ్డను ఎత్తుకెళ్తున్నారని భావించి

Updated : 06 Feb 2022 10:26 IST


కారు వెనుక పరుగులు తీస్తున్న ఆవు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తమిళనాడు శివగంగై జిల్లాలోని కండరమాణిక్యం గ్రామానికి చెందిన రైతు పెంచుకుంటున్న ఆవు మేతకు వెళ్లి పొన్నకుడి ప్రాంతంలో దూడను ఈనింది. విషయం తెలుసుకున్న ఆ రైతు ఆవుని, దూడను తీసుకొచ్చేరదుకు వెళ్లాడు. దూడను కారు వెనుకభాగంలో ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుండగా తల్లి ఆవు తన బిడ్డను ఎత్తుకెళ్తున్నారని భావించి కారు వెనుక పరుగులు తీసింది. అలా సుమారు రెండున్నర కిలోమీటర్లు పరిగెత్తింది. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని