logo

Hyderabad News: త్వరలో ఐదు వేల వాహనాలు వేలం

నగర పోలీసులు తనిఖీల్లో భాగంగా సీజ్‌ చేసిన సుమారు 5 వేల వాహనాలు వేలం వేయటానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

Updated : 23 Feb 2022 07:53 IST


గోషామహల్‌ పోలీసు స్టేడియంలో ఉంచిన వాహనాలు

గోషామహల్‌, న్యూస్‌టుడే: నగర పోలీసులు తనిఖీల్లో భాగంగా సీజ్‌ చేసిన సుమారు 5 వేల వాహనాలు వేలం వేయటానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు, గోషామహల్‌ పోలీసు స్టేడియంతో పాటు ఇతర కార్యాలయాలు వివిధ కేసులకు సంబంధించిన వాహనాలతో నిండినట్లు గుర్తు చేశారు. గోషామహల్‌ పోలీసుస్టేడియంలో సుమారు 600 వాహనాలకు వేలం వేసే ప్రక్రియను సీవీ ఆనంద్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన పద్ధతిలో వాహనాలు వేలం వేయాలని అధికారులకు సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 550 మంది బిడ్డర్లు హాజరై.. వేలంలో 600 వాహనాలను కొనుగోలు చేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.51.74 లక్షల ఆదాయం సమకూరిందని సీపీ తెలిపారు. సీజ్డ్‌ వాహనాల వేలం కమిటీ ఛైర్మన్‌, నగర పోలీసు జాయింట్‌ కమిషనరు కార్తికేయ, ట్రాఫిక్‌ డీసీపీ-2 మద్దిపాటి శ్రీనివాస్‌రావు, గోషామహల్‌ ట్రాఫిక్‌ ఏసీపీ కోటేశ్వర్‌రావు, సీఐ వెంకటేశ్వర్‌యాదవ్‌, గోషామహల్‌ ఏసీపీ సతీశ్‌కుమార్‌, షాయినాయత్‌గంజ్‌ సీఐ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సీవీ ఆనంద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని