logo

Crime News: మంచు విష్ణు హెయిర్‌ స్టైలిస్ట్‌పై కేసు

సినీనటుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం..

Updated : 28 Feb 2022 06:45 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీనటుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచు విష్ణు వద్ద బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్‌ సైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. చరవాణిలో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. చోరీకి పాల్పడినట్లు లీగల్‌ మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని