logo

Telangana News: ఏటా అతని గడ్డి వామే కాలిపోతోంది.. కారణం ఏంటంటే?

ఏటా అతని గడ్డివాము కాలిపోతోంది. తనకే ఎందుకిలా అవుతుందని బాధితుడు మథనపడేవాడు. ఇవి ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘటనలు కావని, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. చడీచప్పుడు చేయకుండా

Updated : 28 Feb 2022 11:42 IST

బుచ్చాను స్తంభానికి కట్టేస్తున్న స్థానికులు

కారేపల్లి(ఖమ్మం), న్యూస్‌టుడే: ఏటా అతని గడ్డివాము కాలిపోతోంది. తనకే ఎందుకిలా అవుతుందని బాధితుడు మథనపడేవాడు. ఇవి ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘటనలు కావని, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాడు. చడీచప్పుడు చేయకుండా ఇంటి ఆవరణలో సీసీ కెమేరా ఏర్పాటు చేశాడు. ఎప్పటిలానే ఈసారీ అతని గడ్డి మంటల్లో కాలిపోయింది. కానీ ఈ చర్యకు పాల్పడుతున్న వ్యక్తి కెమేరా కంటికి చిక్కాడు.

బొక్కలతండాకు చెందిన వాంకుడోతు బాబులాల్‌కు రెండెకరాల  వరి పొలం ఉంది. నూర్పిళ్ల అనంతరం గడ్డిని తీసుకొచ్చి ఇంటి వెనక వాము ఏర్పాటు చేసుకునేవాడు. ఆ వాము నాలుగేళ్లుగా ఏటా ఏదో ఒకరోజు మంటలకు ఆహుతవుతుండేది. ఈ నేపథ్యంలో బాబులాల్‌ ఒక రోజు క్రితం ఈ నెల 26న ఇంటి చుట్టూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలియని నిందితుడు ఎప్పటిలానే ఆదివారం తెల్లవారుజామున (సుమారు 3గం.) గడ్డికి నిప్పటించాడు. ఎగిసిపడ్డ మంటలను బాబూలాల్‌ చుట్టుపక్కల వారి సాయంతో ఆర్పాడు. ఆ తర్వాత సీసీ కెమేరా ఫుటేజీని పరిశీలించగా అదే తండాకు చెందిన బుచ్చా అనే వ్యక్తి అగ్గిపెట్టెతో గడ్డిని కాల్చినట్టు కనిపించింది. కోపోద్రిక్తులైన స్థానికులు బుచ్చాను అదుపులోకి తీసుకుని ఓ స్తంభానికి తాడుతో కట్టేశారు. పంచాయతీ నిర్వహించారు. ఈ దృశ్యాలు వాట్సాప్‌లో వైరల్‌ కావటంతో ఏఎస్సై కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను ఠాణాకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని