logo

Bheemla Nayak: ‘భీమ్లానాయక్‌ చిత్రంలో ఆ సన్నివేశం తొలగించండి’

భీమ్లానాయక్‌ చిత్రంలో కుమ్మరుల మనోభావాలు దెబ్బతినేలా చిత్రీకరించిన ఒక సన్నివేశం తొలగించాలని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు

Updated : 01 Mar 2022 09:26 IST

 ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పురుషోత్తం
 గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు

మాట్లాడుతున్న పురుషోత్తం

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భీమ్లానాయక్‌ చిత్రంలో కుమ్మరుల మనోభావాలు దెబ్బతినేలా చిత్రీకరించిన ఒక సన్నివేశం తొలగించాలని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన భీమ్లానాయక్‌ చిత్రంలో ప్రతి నాయకుడు దగ్గుబాటి రానా కుమ్మరి చక్రంను కాలితో తన్ని తన ప్రత్యర్థిపై దాడి చేసినట్లు చిత్రీకరించారు. తాము ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రంను కాలితో తన్నిన సన్నివేశం తమను కించపరిచేలా, కుమ్మరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది. చిత్ర దర్శకులు, నిర్మాత, కథానాయకులపై చర్యలు తీసుకుని ఆ సన్నివేశం వెంటనే తొలగించేలా చూడాలని ఫిర్యాదు చేశానని’ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని