logo

Ravi shastri: విహారి ఇంకో పదేళ్లు ఆడతాడు: రవిశాస్త్రి

మరో పదేళ్లు క్రికెట్‌ ఆడే సామర్థ్యం, నైపుణ్యాలు హనుమ విహారికి ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గురువారం ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో సెయింట్‌ జాన్స్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటుచేసిన కోచింగ్‌ బియాండ్‌

Published : 04 Mar 2022 06:47 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మరో పదేళ్లు క్రికెట్‌ ఆడే సామర్థ్యం, నైపుణ్యాలు హనుమ విహారికి ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గురువారం ఈస్ట్‌ మారేడ్‌పల్లిలో సెయింట్‌ జాన్స్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఏర్పాటుచేసిన కోచింగ్‌ బియాండ్‌ అకాడమీని మెదక్‌ చర్చి బిషప్‌ ఏసీ సాల్మన్‌ రాజ్‌తో కలిసి రవిశాస్త్రి ప్రారంభించాడు. భారత జట్టు మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, జాన్‌ మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో రవిశాస్త్రి మాట్లాడారు. సెయింట్‌ జాన్స్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌కు రూ.2 లక్షలు విరాళమిచ్చిన విహారి, 20 మంది కుర్రాళ్లకు స్పాన్సర్‌గా నిలుస్తానని ప్రకటించాడు. అతని తల్లి ఆ చెక్కును సాల్మన్‌ రాజ్‌కు అందచేశారు. మరోవైపు ఇటీవల బీసీసీఐ, కోహ్లి వివాదంపై స్పందిస్తూ.. అసలేం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని రవిశాస్త్రి అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని