logo

Train Ticket: స్కాన్‌ చేస్తే రైలు టికెట్‌

నగదు రహిత లావాదేవీల ద్వారా రైలు టికెట్‌ కొనుగోలు చేసే ప్రయాణికులకు మరో అదనపు సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌కార్డు లేని ప్రయాణికులు సైతం ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ఏటీవీఎం) ద్వారా అన్‌రిజర్వుడ్‌ టికెట్లు, ప్లాట్‌ఫా

Updated : 04 Mar 2022 07:46 IST


క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఏటీవీఎం ద్వారా టికెట్‌ పొందే విధానాన్ని వివరిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం : నగదు రహిత లావాదేవీల ద్వారా రైలు టికెట్‌ కొనుగోలు చేసే ప్రయాణికులకు మరో అదనపు సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌కార్డు లేని ప్రయాణికులు సైతం ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌(ఏటీవీఎం) ద్వారా అన్‌రిజర్వుడ్‌ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్లు మరింత సులభంగా పొందేందుకు వీలుగా క్యూఆర్‌(క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా టికెట్‌ ఛార్జీ చెల్లించే అవకాశం కల్పించింది. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఉన్న ఏటీవీఎం పరికరంలో ఈ అదనపు సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇక్కడి ప్రధాన రైల్వేస్టేషన్‌లోని టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ ద్వారా ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1,200 మంది జనరల్‌ రైలు టికెట్లు, 1,300 మంది ప్లాట్‌ఫామ్‌ టికెట్లు తీసుకుంటున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీ తగ్గించేందుకు ఇప్పటికే ఇక్కడ ఏటీవీఎం సౌకర్యాన్ని కల్పించగా దీనిద్వారా ప్రస్తుతం రోజూ సుమారు 150 మంది ప్రయాణ టికెట్లు పొందుతున్నారు.

వినియోగమిలా...

ఏటీవీఎంలో టికెట్‌ ఛార్జీ చెల్లింపునకు ప్రస్తుతం ఉన్న అప్షన్లకు అదనంగా పేటీఎం ద్వారా యూపీఐ, ఫ్రీఛార్జీ ద్వారా యూపీఐ వంటి రెండు ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణ వివరాలు నమోదు చేసిన తర్వాత క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు ఏటీవీఎం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కన్పిస్తుంది. దీనిని స్కాన్‌ చేసి ఫోన్‌ ద్వారా టికెట్‌ ఛార్జీ చెల్లించవచ్ఛు డిజిటల్‌ విధానంలో చెల్లింపు పూర్తయిన తర్వాత యంత్రం ద్వారా టికెట్‌ వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని