logo

Hyderabad News: నెహ్రూ జూపార్కులో పులులు, సింహాలకు కూలర్లు

వేసవి సందర్భంగా నెహ్రూ జూపార్కులో ముందస్తు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పులులు, సింహాలు, చిరుతల ఎన్‌క్లోరుల సమీపంలో సుమారు 50 చల్లదనం పంచే కూలర్లు ఏర్పాటు చేశారు. పగటి పూట జంతువులు, పక్షుల ఎన్‌క్లోజరుల సమీపంలో

Updated : 06 Mar 2022 08:58 IST

జూలో చిరుత పులి ఎన్‌క్లోజరు వద్ద కూలర్‌  

చార్మినార్‌, న్యూస్‌టుడే: వేసవి సందర్భంగా నెహ్రూ జూపార్కులో ముందస్తు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పులులు, సింహాలు, చిరుతల ఎన్‌క్లోరుల సమీపంలో సుమారు 50 చల్లదనం పంచే కూలర్లు ఏర్పాటు చేశారు. పగటి పూట జంతువులు, పక్షుల ఎన్‌క్లోజరుల సమీపంలో చల్లదనం ఉండేలా ఫాగర్లు, స్ప్రింక్లర్లు వినియోగించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది జూలో తాగునీటి కొరత లేకుండా చూస్తున్నారు. జూ ప్రవేశం పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకరు, ఏనుగుల సఫారీ ఎదురుగా నిర్మించిన మరో నీటి ట్యాంకరు నుంచి సందర్శకులకు తాగునీటి ఎద్దడి లేకుండా 300కు పైగానే కుళాయిలు ఏర్పాటు చేసినట్లు క్యూరేటరు రాజశేఖర్‌ వివరించారు.


సింహం ఎన్‌క్లోజరు వద్ద ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని