logo

Hyderabad News: క్రిప్టో కరెన్సీ కొనాలని రూ.73 లక్షలు ఖాళీ

క్రిప్టో కరెన్సీ కొంటే రూ.కోట్ల లాభాలొస్తాయని నమ్మించి రూ.73 లక్షలు కొట్టేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. కవాడిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్‌ టెలిగ్రామ్‌ ఖాతా

Updated : 11 Mar 2022 08:47 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: క్రిప్టో కరెన్సీ కొంటే రూ.కోట్ల లాభాలొస్తాయని నమ్మించి రూ.73 లక్షలు కొట్టేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. కవాడిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్‌ టెలిగ్రామ్‌ ఖాతా తన ప్రమేయం లేకుండానే ‘బీటీసీ ప్రాఫిట్‌ టెలిగ్రామ్‌’ గ్రూప్‌తో అనుసంధానమైంది. అందులో క్రిప్టో కరెన్సీ లాభాలై చాటింగ్‌లు నడుస్తున్నాయి. దాంట్లో శ్రీనివాస్‌ భాగమై సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. పదేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నానని, లాభాలు ఆర్జిస్తున్నానని నమ్మించి బాధితుడితో ‘కె కాయిన్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాడు. ఆ వ్యక్తి చెప్పిన రీతిలో శ్రీనివాస్‌ రూ.30లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ కొని ఆ యాప్‌ ద్వారా పంపించాడు. దానికి రూ.కోటి లాభం వచ్చిందని యాప్‌లో కనిపిస్తోంది. దాంతో విడతలవారీగా రూ.73 లక్షలతో కొన్నాడు. తర్వాత రూ.4 కోట్లు లాభం వచ్చిందని కనిపించినా విత్‌డ్రాకు సాధ్యపడలేదు. సైబర్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మరో ఘటనలో.. అంబర్‌పేటకు చెందిన రాజు, మరో ముగ్గురు స్నేహితులు కలిసి రూ.28లక్షల క్రిప్టో కరెన్సీ కొని ఓ వ్యక్తికి బదిలీ చేశారు. తర్వాత లాభాలు వచ్చాయని కనిపిస్తున్నా.. విత్‌డ్రా కాకపోవడంతో సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని