logo

కత్తులతో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు.. ఉపాధ్యాయుల ఆందోళన

పాఠశాల విద్యార్థులు కత్తులతో పాఠశాలకు వస్తుండటంతో భద్రత కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తేని జిల్లా దేవారం, దేవదానపట్టి, జి.కల్లుపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడి చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.

Updated : 19 Mar 2022 08:50 IST


ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

సైదాపేట(తమిళనాడు), న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులు కత్తులతో పాఠశాలకు వస్తుండటంతో భద్రత కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తేని జిల్లా దేవారం, దేవదానపట్టి, జి.కల్లుపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై విద్యార్థులు దాడి చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో భద్రత కోరుతూ తేని విద్యా కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘ సామాఖ్య తరఫున ఆందోళన చేశారు. దీని గురించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ... దేవారమ్‌ పాఠశాల్లో పుస్తకం తీసుకురమ్మని చెప్పిన ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి చేశారని తెలిపారు. జి.కల్లుపట్టిలో విద్యార్థులు ఉపాధ్యాయులను హేళన చేశారని పేర్కొన్నారు. దేవదానపట్టిలో విద్యార్థి కత్తితో ఉపాధ్యాయుడిని పొడిచేందుకు యత్నించాడని తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ కత్తితో వచ్చిన విద్యార్థి పోలీసుల ముందే ఉపాధ్యాయుడిని బెదిరించాడని తెలిపారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని