logo

Hyderabad News: జూనియర్‌ ఎన్టీఆర్‌ వాహనానికి నల్లతెర తొలగింపు

నలుపు తెరలతో ప్రయాణిస్తున్న వాహనాలపై రెండో రోజు ఆదివారం ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు ఆధ్వర్యంలో....

Published : 21 Mar 2022 08:00 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: నలుపు తెరలతో ప్రయాణిస్తున్న వాహనాలపై రెండో రోజు ఆదివారం ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో చేపట్టిన తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి నలుపు తెరలను, స్టిక్కర్లను తొలగించారు. ఇందులో భాగంగా జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు నలుపు తెర ఉండటంతో వాహనాన్ని ఆపి తెరను తొలగించారు. ఈ సమయంలో డ్రైవరుతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారుడు, మరొకరు ఉన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌, మేరాజ్‌ హుస్సేన్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి పేరుతో స్టిక్కర్‌ ఉన్న వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించి తొలగించారు. నంబరుప్లేటు సరిగా లేని వాహనాలకు చలానాలు విధించారు. 90 వాహనాలపై కేసులు నమోదుచేసినట్లు ముత్తు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని