logo

Cyber Crime: కరోనా ఇన్సూరెన్స్‌ వచ్చిందన్నాడు.. ఖాతా ఖాళీ చేశాడు!

కరోనా ఇన్సూరెన్సు వచ్చిందంటూ బురిడీ కొట్టించి ఖాతా ఖాళీ చేయించిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బూరుగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బుధవారం గుర్తుతెలియని

Published : 24 Mar 2022 08:04 IST

నగదు బదిలీ అయినట్లు రసీదు

ఆసిఫాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనా ఇన్సూరెన్సు వచ్చిందంటూ బురిడీ కొట్టించి ఖాతా ఖాళీ చేయించిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బూరుగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బుధవారం గుర్తుతెలియని ఓ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. మీకు కరోనా ఇన్సూరెన్స్‌ వచ్చిందంటూ రూ.4 వేలు ఖాతాలో జమచేయాలంటూ నమ్మించాడు. ఓ థర్డ్‌ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి ఓటీపీతో మొబైల్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో చూస్కోమని చెబుతూనే అందులో ఉన్న రూ.9 వేలు బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి 1930 నంబరుకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని